తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో పేద ముస్లింలకు షీర్- కుర్మా సామాగ్రి పంపిణీ - దుబ్బాకలో పేద ముస్లింలకు సరకుల పంపిణీ

రంజాన్ మాసం పురస్కరించుకుని.. దుబ్బాకలో పేద ముస్లింలకు తెలంగాణ సేవ సమితి ఆధ్వర్యంలో షీర్- కుర్మా సామాగ్రిని అందజేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఇఫ్తార్ విందులు రద్దయ్యాయని.. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు.

Distribution of Sheer Kurma Supplies to Poor Muslims in Dubbaka
దుబ్బాకలో పేద ముస్లింలకు షీర్ కుర్మా సామాగ్రి పంపిణీ

By

Published : May 21, 2020, 2:03 PM IST

సంగారెడ్డి జిల్లా దుబ్బాకలోని 150 మంది ముస్లింలకు.. రంజాన్ మాసం పురస్కరించుకుని షీర్ కుర్మా సామాగ్రిని అందజేశారు. తెలంగాణ సేవ సమితి అధ్యక్షులు ఫయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో.. ఇఫ్తార్ విందులు రద్దైనట్లు ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రజలకు సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నియమాలను పాటించాలని ఫయాజ్ ఖాన్ కోరారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details