తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ - Congress leaders distribute rice at ramachandrapuram

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. నెల రోజులు దాటినా కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ఇటు జీతాలు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. తమ డిమాండ్లు, సమస్యల్ని పరిష్కరించాలని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న కార్మికులకు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ నాయకులు బియ్యం బస్తాలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కార్మికులకు బాసటగా నిలిచారు.

ఆర్టీసీ కార్మికులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ

By

Published : Nov 13, 2019, 7:44 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భెల్ డిపోలో సమ్మె చేస్తున్న 100 మంది కార్మికులకు కాంగ్రెస్ నాయకులు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్​ కుమార్ హాజరయ్యారు.

గాలి అనిల్ కుమార్ అందించిన నిత్యావసరాలను కుసుమ్ పంపిణీ చేశారు. తెరాస ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై కక్ష ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీపై సమీక్ష జరిపే బదులు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారమవుతాయని అనిల్ కుమార్​ అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి కార్మికుల పక్షాన నిలవాలని గాలి అనిల్ డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ కార్మికులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details