తెలంగాణ

telangana

ETV Bharat / state

నియంత్రిత పద్ధతిలో సాగు లాభదాయకం

మార్కెట్​లో మంచి ధరలు పలికే పంటలను సాగు చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ సాగు అమలు చేస్తున్నట్లు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ తహసీల్దార్​ కార్యాలయంలో రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

distribution-of-pass-books-to-farmers-at-the-premises-of-kohir-tahsildar-office
నియంత్రిత పద్ధతిలో సాగు లాభదాయకం

By

Published : Jun 12, 2020, 7:35 PM IST

పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ తహసీల్దార్​ కార్యాలయం ఆవరణలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

నియంత్రిత సాగు.. లాభాలు బాగు

మార్కెట్​లో మంచి ధరలు పలికే పంటలను సాగు చేసేందుకు నియంత్రిత వ్యవసాయ సాగు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు. భూ ప్రక్షాళన పేరుతో భూ వివాదాలు 90 శాతానికి పైగా పరిష్కరించిన ఏకైక ప్రభుత్వం... తెరాస ప్రభుత్వం అని కొనియాడారు. రైతుబంధు పథకం, ఉచిత విద్యుత్​ అందించి అన్నదాతలను అన్నివిధాలా సీఎం కేసీఆర్​ ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

ABOUT THE AUTHOR

...view details