కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ సౌజన్యంతో.. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు మెదక్ పార్లమెంటు ఇంఛార్జి గాలి అనిల్ కుమార్ అందజేశారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని అన్నారు. నిబంధనలు పాటిస్తూ, అందరు విధిగా మాస్కులు ధరించాలన్నారు. అవసరం అయితే తప్ప ఎవ్వరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని వారు కోరారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని హామీ ఇచ్చారు.
పటాన్చెరులో రాహుల్‌గాంధీ జన్మదినం.. పేదలకు నిత్యవసరాల పంపిణీ - sangareddy district updates
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా.. పటాన్చెరులో పేదలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా.. నిత్యవసర సరకులు పంపిణీ