తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్ చెరు నియోజకవర్గంలో 3.74 లక్షల చేపపిల్లల పంపిణీ - fish distribution news

మత్స్యకారులకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీలో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని చెరువుల్లో 3.74 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారు.

పటాన్ చెరు నియోజకవర్గంలో 3.74 లక్షల చేపపిల్లల పంపిణీ
పటాన్ చెరు నియోజకవర్గంలో 3.74 లక్షల చేపపిల్లల పంపిణీ

By

Published : Sep 1, 2020, 4:22 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఐదు చెరువుల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 3.74 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారు. పటాన్ చెరు, అమీన్ పూర్, బందంకొమ్ము, మాదారం, బొంతపల్లి చెరువుల్లో జిల్లా మత్యశాఖ అధికారి సుజాత ఆధ్వర్యంలో చేపపిల్లలను స్థానిక నాయకులు వదిలిపెట్టారు. మత్స్యకారులకు ఉపాధి నిమిత్తం చేప పిల్లలను చెరువుల్లో వదలినట్లు ఆమె వివరించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినందుకు సంతాపంగా.. ప్రభుత్వం సూచన మేరకు అధికారిక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దూరంగా ఉండటం వల్ల అధికారులు కార్యక్రమం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details