Dinosaur Park Siddipet :ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో కోమటి చెరువు వద్ద డైనోసర్ల జురాసిక్ పార్క్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌లతో వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ ( Siddipet Dinosaur Park ) అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు ఉండబోతోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ప్రసిద్ధి చెందనున్నట్లుగా అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు.
మొదట గుజరాత్ సమీపంలోని రయోలిలో డైనోసార్ గుడ్లు లభించడంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో నిలకడగా ఉండే డైనోసార్‌లను (Telangana Tourist Places) ప్రదర్శనకు ఉంచారు.డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ.. కదలికలు ఉండేలా ఏర్పాటు చేశారు. కానీ సిద్దిపేట పార్క్‌లో మాత్రం కదిలే డైనోసార్లు 18 ఉంచనున్నట్లు చెబుతున్నారు. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క మాటలో దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్కని అక్కడ స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భూతల స్వర్గానికి సరికొత్త అందాలు.. కశ్మీర్ లోయకు పోటెత్తిన పర్యటకులు
Siddipet Dinosaur Theme Park :ఈ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించి ఓ మినీ ట్రైన్ నడిచే విధంగా రూపొందించారు. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుందని చెబుతున్నారు. ఈ ఓపెన్ ట్రైన్‌లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్‌లు (Dinosaur Park in Telangana) మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్ చేశారు. చిన్నాపెద్ద రకాల డైనోసార్‌లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూఇటూ తిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తూ... సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవిధంగా ఉంటాయంటున్నారు.