తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులు భౌతిక దూరం పాటించాలి: డీఈఓ - sangareddy dist news

త్వరలోనే జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుకున్నామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి రాజేశ్​ తెలిపారు. ఈనాడు- ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుమ్మికూడకుండా భౌతిక దూరం పాటించాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు.

sangareddy deo
డీఈఓ

By

Published : Jun 3, 2020, 1:11 PM IST

సంగారెడ్డి జిల్లాలో ఈనాడు- ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఈఓ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా ఆగిన పదో తరగతి పరీక్షలు త్వరలోనే నిర్వహించనున్న తరుణంలో.. విద్యార్థులు తమకున్న సందేహలను జిల్లా విద్యాధికారి రాజేశ్​ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో 144 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటైజర్లు, మాస్కులు, బ్లౌజులు ఏర్పాటు చేశామన్నారు.

ఒక్కో పరీక్షకు రెండురోజుల వ్యవధి ఉన్నందున.. గదుల్ని శుభ్రపరుస్తామని తెలిపారు. విద్యార్థులు గుమ్మికూడకుండా భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

ABOUT THE AUTHOR

...view details