కార్పొరేటర్‌గా గతంలో చేసిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయని సంగారెడ్డి జిల్లా భారతీనగర్ తెరాస అభ్యర్థి సింధు ధీమావ్యక్తం చేశారు. మంచినీరు, రహదారులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. విపక్షాల అభ్యర్థులను గెలిపిస్తే ఏంచేస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి పనులే మరోసారి గెలిపిస్తాయి: సింధు - greater hyderabad polls 2020
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంలో మంచి స్పందన వస్తోందని సంగారెడ్డి జిల్లా భారతీనగర్ తెరాస అభ్యర్థి సింధు తెలిపారు. కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారన్నారు.
అభివృద్ధి పనులే మరోసారి గెలిపిస్తాయి: సింధు
ప్రచారంలో స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.. కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారని సింధు తెలిపారు. గతంలోనూ ప్రజలకు అందుబాటులో ఉన్నామని.. మరోసారి అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి:'తెలంగాణపై సవతి తల్లి ప్రేమ... ఇతర రాష్ట్రాలకు అమ్మ ప్రేమ'