జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధిచెబుతారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లో పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. హైదరాబాద్‌ను రక్షించాలంటే కమలం పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరారు.
ఆ మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి: డీకే అరుణ - జీహెచ్ఎంసీ ఎన్నికల న్యూస్ 2020
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటువేయాలని డీకే అరుణ విజ్ఞప్తిచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సంగారెడ్డి జిల్లా భారతీనగర్‌లో ఆమె ప్రచారం చేశారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు.
ఆ మూడు నియోజకవర్గాల్లోనే అభివృద్ధి: డీకే అరుణ
తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నియోజకవర్గాల్లోనే అభివృద్ధి జరిగిందన్నారు. భారతీనగర్ డివిజన్లో వరద నీటి బాధితులను ఆదుకున్నారా.. అని ప్రశ్నించారు. గత ఎన్నికల ఇచ్చిన హామీల పరిస్థితేంటని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భాజపా అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.