తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు - Demolition of illegal structures in Sangareddy

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తండాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Demolition of illegal structures in Sangareddy
అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

By

Published : Apr 20, 2020, 11:03 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల తండా గ్రామంలో 434 సర్వే నంబర్​లో ఉన్న ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇది తెలుసుకున్న తహసీల్దార్ శివ కుమార్ వెంటనే పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని వీఆర్వోకు ఆదేశాలు ఇచ్చారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతను అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు కరోనా నివారణలో ఉండగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details