పటాన్చెరులో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - ఆక్రమణలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు
గ్రేటర్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు దూకుడు పెంచారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్ల పక్కన నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయరహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

పటాన్చెరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఆక్రమణలను అధికారులు తొలగించారు. గత కొన్ని రోజులుగా ఆక్రమణలపై వివాదం కొనసాగుతుండగా... జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆకస్మాత్తుగా కూల్చివేయటంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లా పరిషత్‌పాఠశాల ఆనుకొని ఉన్న భూమికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు ఉండగా... ఎలా తొలగించారని ప్రశ్నించారు. అధికారుల తీరుపై సుప్రీంకోర్టుకు వెళతామని బాధితులు వెల్లడించారు.