సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందం కొమ్ము చెరువును ఆక్రమించుకుని కొత్తగా వెంచర్ నిర్మాణం సాగుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుపరాదని పలుమార్లు అధికారులు హెచ్చరించినా.. నిర్మాణదారులు పట్టించుకోలేదు.
బందం కొమ్ము చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలు కూల్చివేత - సంగారెడ్డి తాజా వార్త
సంగారెడ్డి జిల్లా కొమ్ము చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిర్మాణ హెచ్చరికలు పట్టించుకోక పోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.
బందం కొమ్ము చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలు కూల్చివేత
దీనితో ఆగ్రహించిన మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సంయుక్తంగా వచ్చి అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. హెచ్చరికలు పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఇంటి ముందు ఇసుకుంటే 25 వేలు జరిమానా వేస్తారా..'
Last Updated : Feb 8, 2020, 6:25 PM IST