తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభమైన డిగ్రీ చివరి సెమిస్టర్​ పరీక్షలు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొవిడ్​ నిబంధనల నడుమ విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాస్తున్నారు.

Degree final semister exams started at Patancheru
పటాన్​చెరులో ప్రారంభమైన డిగ్రీ చివరి సెమిస్టర్​ పరీక్షలు

By

Published : Sep 22, 2020, 7:39 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరో సెమిస్టర్​ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ సుమారు 1,190 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

పటాన్​చెరులో ప్రారంభమైన డిగ్రీ చివరి సెమిస్టర్​ పరీక్షలు

కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు శానిటైజ్​ చేసుకుని లోనికి వచ్చేలా కళాశాల సిబ్బంది ఏర్పాట్లు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత విద్యార్థులను లోనికి అనుమతిస్తున్నారు. పరీక్షకు ముందు, తర్వాత కళాశాల ఆవరణలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

ఇదీచూడండి.. 'ఆరేళ్లు పూర్తయినా... 40వేలకు మించి నిర్మాణాలు జరగలే'

ABOUT THE AUTHOR

...view details