తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్కల దాడిలో ఓ జింక మృతి - sangareddy district

నారాయణఖేడ్​ ఫారెస్ట్​ రేంజ్​లోని మెుర్జి అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. మంజీర నది ఎండిపోవడం వల్ల జింకల్లో నీటి కోసం పలు గ్రామాలకు వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు.

deer-killed-in-dogs-attack-in-sangareddy-district
కుక్కల దాడిలో ఓ జింక మృతి

By

Published : Apr 4, 2020, 5:15 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మొర్జి అటవీ ప్రాంతంలో ఊర కుక్కలు దాడి చేయడం వల్ల ఓ జింక మృతి చెందిందని నారాయణఖేడ్ అటవీ అధికారి దేవిలాల్ తెలిపారు. నాగలిగిద్ద శివారులో మంజీర నది ఎండిపోవడం వల్ల నీరు లేక జింకలు పలు గ్రామాల్లో ఉన్న బోర్ల వద్దకు వస్తున్నాయి.

దీంతో కుక్కలు దాడి చేయగా గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్న జింకను నారాయణఖేడ్ తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందని అటవీ అధికారి తెలిపారు.

కుక్కల దాడిలో ఓ జింక మృతి

ఇవీ చూడండి: 26 రకాల ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details