తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​ - చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

చిరుధాన్యాల పరిరక్షణ కోసం పక్కా ప్రణాళికతో జీవ వైవిధ్య పరిరక్షణ ఉద్యమాన్ని కొససాగిస్తామని డీడీఎస్​ డైరెక్టర్​ పీవీ సతీష్​ తెలిపారు. జనవరి 3న రాష్ట్రపతి భవన్​లో జరిగే జీవ వైవిధ్య వ్యవసాయంపై చర్చలో పాల్గోనున్నట్లు తెలిపారు.

dds director sateesh speaks on millets productions
చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

By

Published : Dec 31, 2019, 7:01 PM IST

చిరుధాన్యాల పరిరక్షణ కోసం 2020 ప్రణాళికతో జీవ వైవిధ్య పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని డెక్కన్ డెవలప్​మెంట్​ సొసైటి డైరెక్టర్ పీవీ సతీష్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ డీడీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్లుగా చేసిన పోరాటానికి ఫలితంగా పర్యావరణ నోబెల్​గా పిలిచే ఐరాస ఈక్విటార్ అవార్డు రావడం సంతోషకరమన్నారు.

జనవరి 3న రాష్ట్రపతి భవన్​లో జరిగే జీవ వైవిధ్య వ్యవసాయంపై చర్చలో పాల్గొనే అవకాశం వచ్చిందని తెలిపారు. 2020 సంవత్సరంలో సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల పరిరక్షణపై గ్రామ స్థాయి నుంచి అందరిని జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూసారాన్ని కలుషితం చేసే పత్తి లాంటి పంటల సాగును కట్టడి చేసి.. సుస్థిర సేంద్రీయ జీవ వైవిధ్య వ్యవసాయం చేసేలా రైతులను సమాయత్తం చేస్తామని సతీష్​ తెలిపారు.

చిరుధాన్యాల కోసం జీవవైవిద్య పరిరక్షణ ఉద్యమం: డీడీఎస్​

ఇవీచూడండి: హ్యాపీ న్యూయర్ అంటూ మదిని మైమరపించే పూల బొకేలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details