సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్థానిక వైద్యాధికారి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో స్థానికంగా నివాసముండే ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు మున్సిపల్ కమిషనర్ సుజాత ధ్రువీకరించారు. పటాన్చెరు మండలంలోని బీడీఎల్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి కూడా కరోనా నిర్ధరణ అయినట్టు స్థానిక వైద్యాధికారి పెంటయ్య తెలిపారు.
పటాన్చెరులో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా వ్యాప్తి - Covid-19 latest updates in Sangareddy District
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు తాజాగా నాలుగు కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

పటాన్చెరులో రోజురోజుకు పెరుగుతోన్న కరోనా వ్యాప్తి
పటాన్‌చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి... జలుబు, దగ్గు లక్షణాల అనుమానంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్‌లో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే అతనిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవడం వల్ల... సోమవారం నాడు అతడిని ఇంట్లోనే ఉంచి మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :
Last Updated : Jun 30, 2020, 9:40 PM IST