సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని నాగూర్ గ్రామానికి చెందిన శాంతమ్మకు కంగ్టిలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఖాతా ఉంది. భర్త చనిపోగా వచ్చిన రూ.5 లక్షల బీమా డబ్బులు, కూతురు వివాహానికి వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కును బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన తుకారం ఆమెకు మాయమాటలు చెప్పి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు ప్రతులను తీసుకున్నాడు. వాటి ద్వారా ఆమె ఖాతాలో ఉన్న డబ్బులను కాజేయాలని పథకం పన్నాడు.
గూగుల్ పేతోనే స్వాహా చేశాడు..
అదే ఊరికి చెందిన రాజు ఇటీవల చరవాణిని పోగొట్టుకోవడం.. అది తుకారాంకు దొరికడం వల్ల అతను చేయాలనుకున్న పని మరింత సులువైంది. చరవాణిలోని సిమ్‌ను వేరొక సెల్లో వేసి గూగుల్ పే డౌన్లో చేసుకున్నాడు.
మరో మహిళను శాంతమ్మ అంటూ బ్యాంకు అధికారులకు చూపించాడు. బ్యాంకు అకౌంటుకు కొత్త ఫోన్ నెంబర్ లింక్ చేయాలని అధికారులను కోరాడు. దీనితో ఆమె ఖాతాలోని డబ్బులు రెండు నెలల్లో రూ. 2 లక్షల 50 వేల రూపాయలు ఖాళీ చేశాడు.