సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్ట్(సింగూర్)పరిధిలోని మొసళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రంలోని మొసళ్లు చస్తూ బతుకుతున్నాయి. ఈ కేంద్రంలో దాదాపు 150 మొసళ్లు జీవిస్తున్నాయి. కాగా సహజంగా వీటిని ఐదు, ఆరు నెలల్లోనే ప్రాజెక్టు లేదా నదిలో వదిలి పెట్టాలి. వర్షాభావ పరిస్థితుల వల్ల మూడేళ్లుగా ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం వల్ల అందులో మొసళ్లు వదలడానికి వీలు కాలేదు. దీనితో ఉత్పత్తి కేంద్రంలో వాటి సంతతి పెరిగి కొలను ఇరుకుగా మారింది. స్థలం సరిపోక నిత్యం వాటిలో అవే కొట్లాడుకుంటున్నాయి.
స్థలం కోసమై మొసళ్ల జీవన్మరణ పోరాటం.. - మంజీరా ప్రాజెక్టు వద్ద మొసళ్లు తాజా వార్త
జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి మొసళ్లు. సంగారెడ్డి జిల్లాలోని మొసళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రంలో సంతతి పెరిగి.. స్థలం కోసం ఒకదానిపై ఒకటి దాడిచేసుకునే పరిస్థితి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల వల్లే మంజీరా ప్రాజెక్టులోకి వదలలేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
స్థలం కోసమై మొసళ్ల జీవన్మరణ పోరాటం..
చిన్న వాటిపై పెద్దవి దాడి చేసి చంపి తినేస్తున్నాయి. దీనిపై అటవీశాఖ అధికారులను ఈటీవీ భారత్ ప్రశ్నించగా ఉన్నత అధికారుల ఆదేశానుసారంతో నీళ్లున్న ప్రాజెక్టులో మొసళ్లను వదులుతామని వివరించారు.