తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న కారణాలు... పెద్ద తప్పులు - sangareddy

రాను రాను కొంత మంది మృగంలా మారుతున్నారు. కంటికి రెప్పాలా కాపాడాల్సిన వారే కాలయములు అవుతున్నారు. మద్యం మత్తులో ఒకరు... అనుమానంతో మరొకరు.. ఆర్థిక ఇబ్బందులతో ఇంకొకరు... ఇలా దారుణాలకు ఒడిగడుతున్నారు.  ఉమ్మడి మెదక్​ జిల్లాలో జరుగుతున్న వరస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చనిపోయిన చిన్నారులు

By

Published : Apr 27, 2019, 2:06 PM IST

చిన్న కారణాలు... పెద్ద తప్పులు

తండ్రి అంటే భరోసా... నాన్న అంటే ధీమా.. కానీ ఆ తండ్రే బిడ్డల పాలిట యముడిగా మారుతున్నాడు. వేలు పట్టినడిపించిన నాన్నే దారుణానికి ఒడిగడుతున్నాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు తండ్రులు తమ పిల్లల ప్రాణాలు బలిగొన్నారు. వరసగా జరగుతున్న ఈ దుర్ఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తోన్నాయి.

ఆర్థిక ఇబ్బందులు

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చంపేటకు చెందిన రాజేందర్ ఆర్థిక ఇబ్బందులతో గురువారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం క్రితం ఆరోగ్య సమస్యలతో భార్య చనిపోయింది. ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బనిసైన రాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇవ్వాలో వివరాలు సూసైడ్ నోట్ రాసిమరీ చనిపోయాడు.

అనుమానం

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బోంబాయి కాలనీకి చెందిన కుమార్ అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడు. గత నెల 10న ఆమెను తీవ్రంగా కొట్టడం వల్ల పిల్లలతో పుట్టింటికి వెళ్తుండగా అడ్డుకుని పిల్లలను తన వద్దే ఉంచుకున్నాడు. పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతో ఈ నెల 11న ముగ్గురు చిన్నారులకు ఉరి వేశాడు. పిల్లలు ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు వెళ్లి వారిని కాపాడారు. చిన్నారులు తండ్రి లేని వారవుతారన్న అభిప్రాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మద్యం మత్తులో కాలయముడిగా మారిన ఆ తండ్రి 16న అర్ధరాత్రి 4 సంవత్సరాల వయసు ఉన్న కూతురుకు ఉరి వేశాడు. 7 సంవత్సరాల వయస్సు ఉన్న అఖిల్​ను గొంతు కోసి చంపాడు. 10 సంవత్సరాల వయస్సు ఉన్న మరో కూతురును కూడా గొంతు కోసి చంపబోతే తప్పించుకుంది.


అర్థం పర్థం లేని అనుమానాలు, మద్యం మత్తు, ఆర్థిక ఇబ్బందులతో హత్య చేయడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదు. అభం శుభం తెలియని చిన్నారులను అంతమొందించడం హేయమైన చర్య. మనుషుల్లో మార్పు వచ్చినప్పడే ఆరోగ్యకర సమాజం నిర్మితమవుతుంది. ఇవీ చూడండి: లంకలో భీకర పోరు- 15 మంది మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details