చిన్న వయస్సు నుంచే అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించి బాలలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు గాడియం పాఠశాలలో జన్ నెక్ట్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీని అశ్విన్ ప్రారంభించారు. ఉత్తమ సదుపాయాలు అందించడం ద్వారా భవిష్యత్తులో మంచిగా రాణించగలుగుతారని ఆయన వెల్లడించారు. కాసేపు విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశామని పాఠశాల వ్యవస్థాపకురాలు ప్రీతి రెడ్డి తెలిపారు.
క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రవిచంద్రన్ అశ్విన్ - sangareddy district
సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని గాడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రారంభించారు.

క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రవిచంద్రన్ అశ్విన్
క్రికెట్ అకాడమీని ప్రారంభించిన రవిచంద్రన్ అశ్విన్
ఇవీ చూడండి: 'బంగ్లాను ఓడించేందుకు పక్కా ప్లాన్‌తో వస్తాం'