కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీపీఎం నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నాయకులు దీక్ష కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లోనూ కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పథకంలో అవకాశం ఇవ్వాలని అన్నారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ సత్యాగ్రహ దీక్ష - arogyasri
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీపీఎం నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఎం సత్యాగ్రహ దీక్ష
కరోనా కట్టడి చర్యలను పోలీసు, పురపాలక, పంచాయతీ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని అన్నారు. సత్యాగ్రహ దీక్షలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాంచందర్, జిల్లా నాయకులు మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సీపీఎం నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు.. నేతల అరెస్ట్