మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో.. పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని రాఘవులు పేర్కొన్నారు. కేంద్రం కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు.. తాయిలాలుగా బడ్జెట్ను రూపొందించిందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.