సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా కొనసాగుతోంది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, మిగిలిన మండలాల ఓట్ల లెక్కింపు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించారు. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆర్డీఓ రాజేశ్వర్ ఓట్ల లెక్కింపు సరళిని పర్యవేక్షించారు. స్థానిక డీఎస్పీ సత్యనారాయణరాజు, సీఐ వెంకటేశ్వరరావు బందోబస్తు చేపట్టారు.
నారాయణఖేడ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు - zptc
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.
![నారాయణఖేడ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3466655-thumbnail-3x2-co.jpg)
కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు