తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: నారాయణఖేడ్​ ఎమ్మెల్యే

పత్తి రైతులు, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగులు కేంద్రాల్లో ఉత్పత్తులు చెయ్యాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ జిల్లా పత్తి కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు.

cotton purchasing center open at narayanakhed in sangareddy district
పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: నారాయణఖేడ్​ ఎమ్మెల్యే

By

Published : Nov 12, 2020, 8:15 PM IST

రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని.. ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామ శివారులో గల లక్ష్మీవెంకటేశ్వర కాటన్ మిల్లులో సీసీఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో రైతుల ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు.

పత్తి రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగులు కేంద్రాల్లో ఉత్పత్తులు విక్రయించాలన్నారు. అధికారులు రైతులకు అన్ని విధాలా సహాయం అందించాలని సూచించారు. పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని అన్నారు.

ఇదీ చూడండి:ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది: పొంగులేటి

ABOUT THE AUTHOR

...view details