తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణ ఖేడ్​లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు - నారాయణ ఖేడ్​ కరోనా వార్తలు

సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 12 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపిస్తోంది. కల్హేర్​లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి కరోనా సోకింది.

corona
corona

By

Published : Jul 10, 2020, 9:55 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గ పరిధిలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆరంభంలో ఒక్క కేసు లేని ఈ ప్రాంతంలో ప్రస్తుతం 12 కేసులు వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాలకూ కరోనా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఒక కేసు నమోదైంది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగులో ఒకరికి వ్యాధి సోకగా, ఆయన కుటుంబంలోని ముగ్గురితో పాటు అదే గ్రామానికి చెందిన మరో మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది.

నాగల్గిద్ద మండలంలోని ఔదాతపూర్​లో వారం క్రితం రెండు కేసులు వెలుగు చూశాయి. అదే గ్రామంలో ఇటీవల మరో కేసు బయటపడింది. కంగ్టి మండలంలోని తడ్కల్​లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కల్హేర్​లో ఓప్రభుత్వ ఉద్యోగికి కరోనా సోకింది.

ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

ABOUT THE AUTHOR

...view details