సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రాజీవ్ గాంధీచౌక్‌లో కంగ్టి గురుకుల పాఠశాల ఆర్ట్ అధ్యాపకుడు దేవేందర్ కరోనా కట్టడిపై వేసిన కళాకృతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం.. కరోనాను తరిమి వేద్దాం అనే నినాదంతో ఆయన భారీ చిత్రం వేశారు.
కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం - కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం
లాక్డౌన్ నేపథ్యంలో పట్టణంలోని రహదారులపైకి వస్తే కరోనా మహమ్మారి కాటేస్తోంది.. జాగ్రత్త సుమా అంటూ చిత్ర కళాకారులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కూడలిలో పెద్ద చిత్రం వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా చిత్రం.. అవగాహనకు అద్దం
పోలీసులు, మున్సిపల్, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు తన వంతు కూడా సహకారం అందించాలనే ఆలోచనతో ఈ చిత్రం గీసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం వేయడానికి ఐదు గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ చిత్రం వేయటం వల్ల ఆయన్ని పలువురు అభినందించారు.