తెలంగాణ

telangana

ETV Bharat / state

సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉద్యోగికి కరోనా - corona cases in sangareddy district

ఉద్యోగికి కరోనా సోకడం వల్ల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. 9వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభిస్తామని సబ్ రిజిస్టర్ తెలిపారు.

corona positive case reported in sub registrar office in sangareddy district
సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉద్యోగికి కరోనా

By

Published : Sep 5, 2020, 4:20 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా సోకింది. ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేయించుకోగా ఒకరికి పాజిటివ్ అని తేలింది.

ఉద్యోగికి కరోనా సోకడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. నేటి నుంచి 8వ తేదీ వరకు కార్యాలయం మూసివేయనున్నారు. 9వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభిస్తామని సబ్ రిజిస్టర్ తెలిపారు.

ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details