సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తుగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. 10 పడకలున్న వార్డును 30 పడకలకు పొడfగిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ముందస్తుగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఈ వార్డును జడ్పీ ఛైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి పరిశీలించారు.
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డు
ఈ వార్డును జడ్పీ ఛైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
వ్యక్తిగత శుభ్రత పాటించి, అప్రమత్తంగా ఉంటే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని, మున్ముందు నమోదైనా చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
- ఇదీ చూడండి:'సంకల్పం, సంయమనంతోనే కరోనాపై విజయం'