సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పర్శపల్లిలో కరోనా కలవరం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్ బారినపడ్డారు. ఫలితంగా గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.
పర్శపల్లిలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా - Parshapally corona cases news
రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పర్శపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
![పర్శపల్లిలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా Corona for six members in the same family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11275634-271-11275634-1617531016120.jpg)
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రధాన వీధుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేయించారు. కేసులు నమోదైన వీధిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సిరిపూర్‌లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం