సంగారెడ్డి నియోజకవర్గంలో కొవిడ్ విజృంభణతో రోజువారి కూలీలకు ఉపాధి కరవైంది. పనులకు పిలిచేవారు లేక మధ్యాహ్నం కావొస్తున్న అడ్డామీదే కూర్చుని ధీనంగా చూస్తున్నారు. కరోనా వైరస్ తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని కూలీలు వాపోయారు.
కరోనాతో రోజువారి కూలీల అవస్థలు - Corona effect on daily labor
రోజువారి కూలీలపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. ఉపాధిలేక పూట గడవడంలేదని వారు వాపోతున్నారు. సంగారెడ్డిలో కూలీలు పనులు దొరక్క రోడ్డు పక్కన కూర్చుని ఉన్నారు.
కరోనాతో రోజువారి కూలీల అవస్థలు
లాక్డౌన్కు ముందు అడ్డామీద ఉంటే ఉదయం 10 గంటలలోపే ఏదో ఒక పని దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహమ్మారి భయానికి పనికి పిలవటానికి ఎవరు ముందుకు రావడం లేదు. అధికారులు, రాజకీయ నాయకులకు తమ అవస్థలు చెప్పినా ఎలాంటి సహాయం అందించడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కూలీలు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్