తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణఖేడ్​ను వణికించిన కరోనా - corona cases in narayanakhed

హైదరాబాద్​లోని నుంచి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగామ గ్రామానికి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆ వ్యక్తి నారాయణఖేడ్ పట్టణంలో తిరగడం వల్ల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

corona cases in sangareddy district
నారాయణఖేడ్​ను వణికించిన కరోనా

By

Published : May 23, 2020, 11:22 AM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్​ మండలం గారిడేగామ గ్రామానికి హైదరాబాద్​ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోరనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అతని ప్రైమరీ కాంటాక్ట్​లో ఉన్న మరో ముగ్గురికి వైరస్ సోకింది.

మే 10న గారిడేగామ గ్రామానికి వచ్చిన ఆ వ్యక్తి జలుబు, దగ్గుతో నారాయణఖేడ్​ ఆసుపత్రిలో రెండ్రోజులు చికిత్స పొందాడు. అనంతరం పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల వైద్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి నారాయణఖేడ్ పట్టణంలో తిరగడం వల్ల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.

ఆ వ్యక్తి తిరిగిన ప్రాంతాలను గుర్తించిన అధికారులు అతనితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లో ఉన్న 26 మందిని క్వారంటైన్​కు తరలించి, నమూనాలు గాంధీ ఆసుపత్రికి పంపించారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు గుర్తిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details