తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసులు - సంగారెడ్డి జిల్లా వార్తలు

పటాన్​చెరు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా బీడీఎల్​ టౌన్​షిప్​లో 3 కేసులు, పటాన్​చెరు అంబేడ్కర్​ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో రసాయనాన్ని పిచికారీ చేస్తున్నారు.

corona cases in patancheru constituency in sangareddy district
పటాన్​చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Jun 18, 2020, 4:02 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎల్ టౌన్​షిప్​, పటాన్​చెరు అంబేడ్కర్​ కాలనీలో వచ్చిన కొత్త కేసులతో కలుపుకుని మెుత్తం 13 కేసులు నమోదయ్యాయి. కొత్తగా బీడీఎల్ టౌన్​షిప్​లో మూడు కేసులు, పటాన్​చెరు అంబేడ్కర్​ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారణ చేశారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 కేసులు నమోదయ్యాయని అధికారులు నిర్ధారణ చేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన వారెవరో తెలుసుకుంటున్నారు. వారిని క్వారంటైన్​కు తరలిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనాపై అవగాహనే లక్ష్యంగా ఘనంగా 'మాస్క్​డే'

ABOUT THE AUTHOR

...view details