సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రేపటి జనతా కర్ఫ్యూకు సహకరించాలని ప్రచారం కూడా చేస్తోంది. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బంద్ పాటించాలని చెబుతోంది.
'ప్రతి ఒక్కరూ.. జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి' - జనతా కర్ఫ్యూపై ప్రత్యేక అవగాహన
ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బంద్ పాటించాలని చెబుతోంది.
'ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి'
బహిరంగ కూడళ్లలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ట్రాఫిక్ అధికారులు వివరిస్తున్నారు. అలాగే ఆదివారం ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటించాలని వాహనాల ద్వారా మైకులు పెట్టి అమీన్పూర్ మున్సిపల్ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.