సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో కంగ్టి మండలం తడ్కల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రానికి తెచ్చిన మొక్కజొన్నలను బస్తాల కొరత వల్ల తూకం వేయకపోవటం వల్ల రైతులకు నిరీక్షణ తప్పట్లేదు. వర్షాలు ముంచుకొస్తున్న తరుణంలో కేంద్రంలో పంటకు కనీస భద్రత లేదని వాపోయారు.
తడ్కల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వల్ల రైతుల ఆందోళన - corn farmers protest at tadkal buying centre
మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో బస్తాల కొరత వల్ల తమ పంటను తూకం వేయట్లేదంటూ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ రైతులు ఆందోళన చేపట్టారు. సొంత బస్తాలు తెచ్చుకున్న వారికి పంట తూకం వేస్తామని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ వివరించారు.
తడ్కల్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వల్ల రైతుల ఆందోళన
తమ మొక్కజొన్నలను వెంటనే తూకం వేయాలని కోరారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌ను వివరణ కోరగా బస్తాల కొరత ఉందని... సొంత బస్తాలు తెచ్చుకున్న రైతుల పంట తూకం వేస్తామని ఆయన వివరించారు.
ఇవీ చూడండి :మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!