తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి పట్టణంలో కట్టడి ముట్టడి - cordon search at vijay nagar colony in sangareddy

సంగారెడ్డి జిల్లాకేంద్రంలో పోలీసులు కట్టడిముట్టడి నిర్వహించారు. వేకువజామున నిర్వహించిన ఈ నిర్బంధ తనిఖీలకు ప్రజలు సహకరించారని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.

cordon search at vijay nagar colony in sangareddy

By

Published : Jul 26, 2019, 10:12 AM IST

సంగారెడ్డి పట్టణం విజయ్​నగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కట్టడి ముట్టడిలో డీఎస్పీ శ్రీధర్​తో పాటు, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో అనుమానంగా ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

సంగారెడ్డి పట్టణంలో కట్టడి ముట్టడి

ABOUT THE AUTHOR

...view details