తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు - cordon_seach_in_zahirabad at sangareddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పోలీసులు నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో... సరైన ధృవపత్రాలు లేని 24 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఎవరైన వ్యక్తులు తమ పరిసరాల్లో తిరుగుతూ కనిపిస్తే 100కి కాల్​ చేయాలని డీఎస్పీ గణపతి జాదవ్​ కోరారు.

cordon_seach_in_zahirabad at sangareddy
జహీరాబాద్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

By

Published : Jan 30, 2020, 12:23 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ గణపతి జాదవ్ నేతృత్వంలో పట్టణంలోని శాంతినగర్, ఐడీఎస్ఎంటి కాలనీల్లో ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించారు.

కాలనీలో అనుమానితులు, పొరుగు రాష్ట్ర వ్యక్తులు నివాసం ఉంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు కనిపిస్తే 100 నెంబర్​కి ఫోన్ చేయాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 24 బైకులు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో జహీరాబాద్ పట్టణ, గ్రామీణ సీఐలు సైదేశ్వర్, కృష్ణ కిషోర్, 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జహీరాబాద్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ఇదీ చూడండి: చిరుతపులిని భయపెట్టిన ఆదిలాబాద్ రైతు

ABOUT THE AUTHOR

...view details