సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈల్ పరిశ్రమలో విషాదం జరిగింది. కాంట్రాక్టు కార్మికుడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. సింగూరుకు చెందిన శ్రీనివాస్ సుమారు 13ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
బీహెచ్ఈఎల్ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. విధుల్లో ఉండగా గుండెపోటుతో హాఠాన్మరణం చెందాడు.
![బీహెచ్ఈఎల్ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి బీహెచ్ఈఎల్ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8397533-445-8397533-1597259014567.jpg)
బీహెచ్ఈఎల్ పరిశ్రమలో గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుడు మృతి
రోజుమాదిరిగానే బుధవారం విధులకు హాజరైన శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కార్మికుడి మృతిపై యాజమాన్యం స్పందించక పోవడం వల్ల కార్మిక సంఘ నాయకులు, ఉద్యోగుల సహకారంతో 3 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని... మృతుని భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్