తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో కంటైన్మెంట్ జోన్లు ఇవే... - Patan Cheru town Corona News

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై చర్యలకు ఉపక్రమించారు.

Containment zones were established in patancheru colonies
ఆ కాలనీలు కంటైన్​మెంట్ జోన్లుగా ఏర్పాటు

By

Published : Aug 6, 2020, 9:13 AM IST

Updated : Aug 6, 2020, 11:02 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గౌతంనగర్, చైతన్యనగర్, జేపీకాలనీల్లో పదికిపైగా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.

ప్రజలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గ్రేటర్ ఎంటమాలజీ సిబ్బంది కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేశారు.

ఇదీ చూడండి :ఈటీవీ భారత్​ స్పందన: '‘పీఎం కిసాన్‌’'లో తెలంగాణకు చోటు

Last Updated : Aug 6, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details