సంగారెడ్డి జిల్లాలో అభివృద్ది కార్యక్రమాల నిర్మాణ సామగ్రి తరలింపునకు అధికారులు వినూత్న పద్ధతిని అవలంబించారు. స్థానికంగా ఉండే గాడిదల ద్వారా సామగ్రిని తరలించాలని నిర్ణయించారు.
సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించేందుకు గాడిదలను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్య పనులకు అవసరమైన సామగ్రి తరిలింపునకు వాహనాలు లేక ఇబ్బంది అవుతోంది. ఫలితంగా కంగ్టి మండలంలోని వివిధ గ్రామాల్లో పనులు నిలిచి పోవటం వల్ల జిల్లా పాలన అధికారి హనుమంతరావు ప్రత్యేక దృష్టి సారించారు.