సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రయ్య గుండె పోటుతో మృతి చెందారు. మృతుని స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం కంసాన్పల్లి. సంగారెడ్డి ఉంటూ విధులు నిర్వహించేవారు.
గుండె పోటుతో విధుల్లోనే కానిస్టేబుల్ మృతి - latest crime news in sangareddy
గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సంగారెడ్డి చోటుచేసుకుంది. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న చంద్రయ్య అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు.
గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
మంగళవారం ఆయనకు గుండెపోటు రావడం వల్ల మృతి చెందారు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రయ్య మృతి పట్ల సంగారెడ్డి పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:హవాలా మార్గంతో తరలిస్తున్న 3 కోట్ల 75 లక్షలు స్వాధీనం