తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంచినీరిచ్చే వరకు పోరాటం ఆపేది లేదు' - latest news of sangareddy

సంగారెడ్డి ప్రజలు మంచినీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజయప్రకాశ్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంజీర డ్యామ్​ సందర్శనకు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

congress-party-leader-nirmala-jayaprakash reddy-arrest in sangareddy
'మాకు మంచినీరిచ్చే వరకు పోరాటం ఆపేదిలేదు'

By

Published : Jun 4, 2020, 4:04 PM IST

సంగారెడ్డిలోని మంజీర డ్యామ్​ సందర్శనకు బయల్దేరిన డీసీసీ అధ్యక్షులు నిర్మలా జయప్రకాశ్​ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్​కు తరలించారు. సంగారెడ్డి నియోజక వర్గ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని నిర్మల అన్నారు. ప్రభుత్వం సంగారెడ్డి ప్రజలను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు.

డబ్బులు ఇచ్చి నీరు కొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజక వర్గం రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. అడగగానే నీరు ఇస్తే ఈ అరెస్టులు, సందర్శనలు వెళ్లడాలు ఉండవని పేర్కొన్నారు. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా మంజీర నీటిని ఇచ్చేవరకు తాము పోరాటాన్ని అపేదిలేదని ఆమె వెల్లడించారు.

'మాకు మంచినీరిచ్చే వరకు పోరాటం ఆపేదిలేదు'

ఇవీచూడండి:చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details