అనుమతులు లేని, క్రమబద్ధీకరణకాని పాత ప్లాటు, నిర్మాణాల రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. తాను రేపు గాంధీభవన్‌లో చేపట్టనున్న దీక్షను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మొదటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ రద్దు నిర్ణయం శుభపరిణామం: జగ్గారెడ్డి - ఎల్ఆర్ఎస్పై జగ్గారెడ్డి స్పందన
ఎల్‌ఆర్‌ఎస్ రద్దు నిర్ణయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ప్రభుత్వం దిగి వచ్చి నిబంధనలను సడలించడం శుభపరిణామమని కొనియాడారు. రేపటి తన దీక్షను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
jaggareddy
కరోనాతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రజలపై ఎల్‌ఆర్‌ఎస్ పేరున భారాన్ని మోపడం సరికాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి నిబంధనలను సడలించడం శుభపరిణామమని కొనియాడారు.
ఇదీ చదవండి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు