సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు వరద బాధితులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్న కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టారు. వరద బాధితులకు సహాయం అందించడంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన చేసేందుకు రెండు రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు.
గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన - గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన
పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు వరద బాధితులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామన్న కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టారు. కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఆందోళన చేసి వెళ్లిపోయారు.
![గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన congress leaders protest for help to flood victims at patancheru in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9510987-142-9510987-1605087683739.jpg)
గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన
పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల బాధితులు ఎవరూ రాలేదు. కేవలం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేసి వెళ్లిపోయారు.
ఇవీ చూడండి: సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'