పెరిగిన ముడిచమురు ధరలను నిరసిస్తూ సంగారెడ్డిలో తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్య మానవుడికి ఆర్థిక భారం ఏర్పడుతుందన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
'కరోనా కాలంలో చమురు ధరలు పెంచడం సరికాదు' - decrease the crude oil cost in india congress eaders protest
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిరసనవ్యక్తం చేశారు. వెంటనే ముడి చమురు ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
!['కరోనా కాలంలో చమురు ధరలు పెంచడం సరికాదు' congress leaders protest at sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7816816-419-7816816-1593428042841.jpg)
'కరోనా కాలంలో చమురు ధరలు పెంచడం సరికాదు'
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోతుంటే మన దగ్గర మాత్రం చమురు ధరలు పెరగడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగచేసిన కాంగ్రెస్ నాయకులు వెన్నంటే ఉంటారని నిర్మల వెల్లడించారు. తక్షణమే చమురు ధరలు తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?