కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సంగారెడ్డిలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు తీర్చే విదంగా ఉండాలి కానీ... ప్రజలకు ఇబ్బందులు పెట్టె విదంగా ఉండటం సరి కాదని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అభిప్రాయపడ్డారు.
'రైతు, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి' - సంగారెడ్డి వార్తలు
సంగారెడ్డిలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ... నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వాలకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
!['రైతు, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి' 'రైతు, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9378915-482-9378915-1604137404735.jpg)
'రైతు, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
కార్మికుల సమస్యలు ప్రభుత్వాలకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వెంటనే రైతు, కార్మిక సమస్యలు పరిష్కరించాలని... లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.