మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఆయన విగ్రహానికి మెదక్ పార్లమెంట్ ఇంఛార్జి గాలి అనిల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు మారువలేనివని అనిల్ కుమార్ కొనియాడారు.
'దేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ' - Rajeev gandhi vardhanthi
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా... విగ్రహానికి పూల మాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. దేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని నాయకులు కొనియాడారు.
!['దేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ' Congress leaders paid tribute to rajeev gandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:32-hyd-tg-23-21-rajeev-vardanti-av-ts10056-21052020122927-2105f-1590044367-637.jpg)
Congress leaders paid tribute to rajeev gandhi
దేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని తెలిపారు. దేశాన్ని ఒకే తాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తిత్వం కల్గిన గొప్ప నాయకుడని తెలిపారు. సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.