సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇళ్లకే పరిమితం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంజీరాను ముట్టడి చేస్తామని తెలుపగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నాయకులు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
పటాన్చెరులో ఇళ్లకే పరిమితమైన హస్తం నేతలు - congress leaders house arrest at patancheru
మంజీరా ముట్టడి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పోలీసులు అప్రమత్తమయ్యారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ నేతలను హెచ్చరించగా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
పటాన్చెరులో ఇళ్లకే పరిమితమైన హస్తం నేతలు
చేసేదేమీ లేక హస్తం నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరూ పట్టణం దాటి వెళ్లకూడదనే ఉద్దేశంతో జాతీయ రహదారిపై టోల్గేట్ల వద్ద జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చూడండి:'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'