పెళ్లి కానుకగా వరుడికి పెట్రోలు బహుమానంగా ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. వివాహానికి వచ్చిన వారిని ఆశ్చర్యపరుస్తూ వినూత్న నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన తెరాస నాయకుడు సయ్యద్ రయీస్ వివాహ విందులో.. కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ మోసిన్ తన మిత్రులతో కలిసి హాజరయ్యారు. వరుడికి పెళ్లి కానుకగా 5 లీటర్ల పెట్రోల్‌ను డబ్బాలో ప్యాకింగ్ చేసి బహుమానంగా అందజేశారు.
Petrol gift: తెరాస నాయకుడి పెళ్లిలో కాంగ్రెస్ నేతలు.. కానుకగా ఏం ఇచ్చారంటే.? - congress leaders gifted petrol in marriage
మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే వారికి వివాహ కానుకగా ఏం ఇస్తాం.. ఏ గృహోపకరణాలో లేదా ఏదైనా గుర్తుండేలా ఇస్తాం. కానీ ఇక్కడ మాత్రం దానికి విభిన్నంగా జరిగింది. సంగారెడ్డి జిల్లాలో తెరాస నాయకుడి పెళ్లికి వెళ్లిన కాంగ్రెస్ నేత పెట్రోల్ బహుమానంగా ఇచ్చారు. దానికి కారణమేంటంటే..
పెళ్లి కానుకగా పెట్రోల్
వరుడితో ప్యాకింగ్ తీయించి పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెళ్లికుమారుడి మిత్రులు పెట్రోల్ బహూకరించడంతో మండపంలో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చదవండి:TSRTC: కోలుకోలేకపోతున్న గ్రేటర్ ఆర్టీసీ.. పల్లెలకు నడవని బస్సులు