సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి 200 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రామచంద్రాపురంలో ఇబ్బదులు పడుతున్న 200 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
నిరుపేదలకు సరకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత - నిత్యావసర సరకుల పంపిణీ
మాజీప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి 200 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

congress leader groceries distribution
కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే దేశంలో అభివృద్ధి జరిగిందని ఆమె అన్నారు. ఆ సమయంలోనే మన ప్రాంతంలో బీడీల్, భెల్, ఇక్రిశాట్, ఓడీఎఫ్ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా అనేక మంది ఉపాది పొందుతున్నారని చెప్పారు.
ఇవీ చూడండి: రైతుబంధును తొలగించేందుకు ప్రభుత్వం కొత్త మెలికలు: రేవంత్‌రెడ్డి