కరోనా వైరస్ తక్కువగా ఉన్న సమయంలో లాక్డౌన్ విధించి కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్డౌన్ ఎత్తివేయాలనుకోవడం ప్రజలను కరోనా మహమ్మారికి బలి చేయడమేనని కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు ఇన్‌ఛార్జి గాలి అనిల్‌కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామ పంచాయతీ సిబ్బందికి, ఆశావర్కర్లకు, గ్రామంలోని 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సాయంగా నిలవడానికి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నడుం బిగించిందన్నారు.
పేదలకు సరకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత - sangareddy district news
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో కాంగ్రెస్ నేత గాలి అనిల్‌కుమార్ గ్రామపంచాయతీ సిబ్బందికి, ఆశావర్కర్లకు, గ్రామంలోని 400 కుటుంబాలకు సరకులు అందించారు. నిరుపేదలకు సాయం అందించేందుకు ముందుకు రావాలని కార్యకర్తలకు సూచించారు.
పేదలకు సరకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత
ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందించాలని కార్యకర్తలకు సూచించారు. కరోనాను తరిమికొట్టేవరకు పేదలకు, ఆకలి బాధలు లేకుండా అండగా నిలవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి:సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్